కమలాపురం పట్టణంలోని క్రాస్ రోడ్స్ వద్ద భారతి సిమెంట్ పరిశ్రమ ఆర్థిక సహకారంతో కడపలోని పుష్పగిరి కంటి ఆసుపత్రి పర్యవేక్షణలో నిర్వహించిన కంటి వైద్య శిబిరాన్ని పరిశ్రమ సీఎంవో సాయిరమేష్ బుధవారం ప్రారంభించారు. వైద్యశాలలో ఉచితంగా కంటి వైద్యం అందించడంతో పాటు ఉచితంగా కంటి అద్దాలు, శస్త్రచికిత్సలు చేస్తామని చెప్పారు. గోపాల్ రెడ్డి, భార్గవ రెడ్డి, నితేశ్వర్, కంటి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.