కడప: వక్తృత్వ వ్యాసరచన పోటీలకు విస్తృత స్పందన

63చూసినవారు
కడప: వక్తృత్వ వ్యాసరచన పోటీలకు విస్తృత స్పందన
భారతదేశంలో విద్యారంగంపై సాంకేతికత ప్రభావం అనే అంశంపై వక్తృత్వ, వ్యాసరచన పోటీలకు విద్యార్థుల నుంచి విస్తృత స్పందన లభించింది. మంగళవారం యోగి వేమన విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ & బయోఇన్ఫర్మేటిక్స్ విభాగం కన్వీనర్ రియాజున్నీసా ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో యూనివర్సిటీలోని వివిధ విభాగాల విద్యార్థులు పాల్గొని తమ ఆలోచనలకు పదును పెట్టారు. విద్యారంగం సాంకేతికత రెండు వేరు చేసి చూడలేనంతగా కలిసిపోయాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్