తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు శాసనమండలిలో కలకలం రేపింది. ఈ కేసులో వైసీపీ నేతల ప్రమేయంపై టీడీపీ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు.మంగళవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీనిపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేయగా, ఇరు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.