ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఈ నెల 18వ తేదీ సోమవారం నుండి మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు.