
ఖాజీపేటలో విగ్రహ ప్రతిష్టలో అపశృతి
ఖాజీపేటలో విగ్రహ ప్రతిష్టలో అపశృతి చోటు చేసుకున్నది. ఆదివారం ఉదయం ఖాజీపేట మండలం తుడుములదిన్నెలో అంకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టలో అపశృతి నెలకొన్నది. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేసే క్రమంలో ధ్వజస్తంభం సగానికి విరిగినది. ప్రమాదం నుంచి భక్తులు తృటిలో తప్పించుకున్నారు. ఎలాంటి నష్టం జరగకపోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.