ప్రొద్దుటూరులో నిబంధనలను పాటించకుండా విద్యా సంస్థలు, దేవాలయాలకు 100 మీటర్ల లోపే ఏర్పాటుచేసిన మద్యం షాపులను తొలగించాలని విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ప్రొద్దుటూరు డిప్యూటీ తహశీల్దార్ సాయినాథ్ రెడ్డికి వారు వినతిపత్రం ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న మద్యం షాపులపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని నాయకులు ఓబులేసు, నరసింహులు మాదిగ, రమేశ్, చెన్నయ్య కోరారు.