ప్రొద్దుటూరు: రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలి

71చూసినవారు
ప్రొద్దుటూరు: రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలి
ప్రొద్దుటూరు వైవీఎస్ మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్లో శనివారం సర్ సివి రామన్ సైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్త వర్గ నిర్ధారణ పరీక్షలు, హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు వంశీకృష్ణ, సెక్రటరీ అల్లా బకాష్ మాట్లాడుతూ హీమోగ్లోబిన్ శాతం ఆరోగ్యవంతులకు 14-17 వరకు ఉండాలని, 9 శాతం కన్నా తగ్గితే అనీమియాతో బాధ పడతారని తెలిపారు. అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని కోరారు.

సంబంధిత పోస్ట్