వేంపల్లె: "వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా వేయాలి"

66చూసినవారు
వేంపల్లె: "వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా వేయాలి"
చిన్నారులు, బాలింతలు, గర్భిణీలకు తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయాలని డిప్యూటీ డీఎంహెచ్ ఉమామహేశ్వరరావు ఆరోగ్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం వేంపల్లి మండలంలోని తాళ్లపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తాళ్లపల్లె, వేముల, సురభి, చక్రాయపేట, వీరపునాయునిపల్లె పీహెచ్ సీలలో పనిచేసే సూపర్ వైజర్లు, ఆరోగ్య సిబ్బందికి వ్యాధి నిరోధక టీకా శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులను ఆయన తనిఖీ చేశారు.