సిద్ధవటం మండల పరిధిలోని కడప చెన్నై ప్రధాన రహదారిపై గల మాధవరం గ్రామపంచాయతీ బంగారు పేట వద్దసోమవారం రాత్రి గుండ్ల కుచేలయ్య (68) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనము అది వేగంగా వచ్చి ఢీకొనడంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తము 108 వాహనంలో కడప రిమ్స్ కు తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు విచారణ చేపట్టారు.