ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అమరావతి సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ క్షత్రియ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు కోరారు. శుక్రవారం ఆయనను ఘనంగా సత్కరించి రాజంపేట అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. అన్నమయ్య డ్యాంను పునర్ నిర్మించి, రాజంపేట నియోజకవర్గ రైతాంగాన్ని కాపాడాలని వారు కోరారు.