జిల్లా సహాయ పౌరసరఫరాల అధికారి అయ్యల క్లెమెంట్ తన రిటైర్డ్ జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రఘురాం అన్నారు. బుధవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా సహాయ పౌరసరఫరాల అధికారి అయ్యల క్లెమెంట్ పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రఘురాం మాట్లాడుతూ అయ్యల పౌరసరఫరాల శాఖలో 35 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించాలన్నారు.