గాలివీడు మండలంలోని బొరెడ్డిగారి పల్లె వద్ద ఆదివారం రాత్రి కథ చెప్పేందుకు వెళ్లిన నాటక బృందంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. నక్కలవాండ్లపల్లి నుంచి వచ్చిన బృందంలో రమణారెడ్డి, మల్లెల వెంకటరమణ మధ్య గొడవ చోటుచేసుకుందని గాలివీడు ఎస్సై రామకృష్ణ తెలిపారు. నాటకం ముగిసిన తర్వాత మార్గమధ్యలో కోనంపేటలో గొడవకు దిగగా.. రమణారెడ్డి తన కుమారులతో వెంకటరమణపై దాడి చేయించి హత్య చేశారని పోలీసులు తెలిపారు.