ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అధికారులు ప్రజా దర్బార్ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం చిన్నమండెం మండలంలోని బోరెడ్డిగారి పల్లెలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.