రాయదుర్గం: చిన్నపాటి వర్షానికి జలమయమైన రహదారులు
రాయదుర్గం పట్టణంలో గురువారం సాయంత్రం కురిసిన చిన్నపాటి వర్షానికే ప్రధాన రహదారి జలమయమైంది. దీంతో ప్రధాన రహదారిపై రాకపోకలు సాగించే పాదచారులు, వాహన చోదకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రాయదుర్గం పట్టణంలో గురువారం జరిగే వారపు సంతలో రైతులు ఏర్పాటు చేసుకున్న దుకాణాలు వర్షానికి కూరగాయలు, ఆకుకూరలు నీటిలో కొట్టుకుపోయాయి. రహదారులపై నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.