బీటీపీ డ్యామ్ నుంచి కాలువలు తవ్వి ఇతర చెరువులకు నీరివ్వాలి

54చూసినవారు
గుమ్మఘట్ట మండలం బీటీపీ డ్యామ్ ను ఏపీ రైతు సంఘం బృందంతో కలిసి జిల్లా సీపీఐ కార్యదర్శి జాఫర్ ఆదివారం పరిశీలించారు. 2014లో టీడీపీ ప్రభుత్వం బీటీపీ డ్యామ్ కు కాలువలు తవ్వి ఇతర చెరువులకు నీరు అందించే పథకాన్ని శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారని, ఆ హామీని ఇప్పటికైనా నేరవేర్చాలని కోరారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రత్యేకచొరవ తీసుకొని పనులను మొదలుపెట్టాలన్నారు. సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్