రాయదుర్గం: అసెంబ్లీ విప్ గా ఎమ్మెల్యే శ్రీనివాసులు ఎంపిక
రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులకు కీలక పదవి లభించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విప్ గా ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన గత టీడీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. అదేవిధంగా పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యులుగా కూడా సేవలందించారు. విప్ గా ఎంపికైనందుకు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేశారు.