రాయదుర్గం: బైరవానితిప్ప ప్రాజెక్టు 1వ గేటు ఎత్తి నీటి విడుదల

61చూసినవారు
గుమ్మఘట్ట మండలం బైరవానితిప్ప ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది. బుధవారం భైరవానితిప్ప ప్రాజెక్టు ఒకటో గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో ఉదయం నుంచి సందర్శకులతో ప్రాజెక్టు కళకళలాడింది. మరింత వరద ఉధృతి కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ప్రాజెక్టును సందర్శించారు.

సంబంధిత పోస్ట్