డి. హిరేహాల్: ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు - ఇబ్బందుల్లో ప్రయాణికులు

58చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని డి. హిరేహాల్ మండలంలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురవడంతో సోమలాపురం వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాయదుర్గం-బళ్ళారి వెళ్లే వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. సోమలాపురం జనతా కాలనీలో ఇళ్లల్లో నీళ్లు చేరడంతో నిత్యవసర సరుకులు పూర్తిగా నానిపోయాయి. అదేవిధంగా ఉద్దేహల్ మండలం బండూరు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

సంబంధిత పోస్ట్