
కళ్యాణదుర్గం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పార్థ సారథి
కళ్యాణదుర్గం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జి. పార్థసారథి చౌదరి ఎన్నికయ్యారు. సదరు ఎన్నికలు గురువారం నిర్వహించగా, అధ్యక్ష స్థానానికి జి పార్థసారథి చౌదరి, హరి చక్రవర్తి పోటీపడ్డారు. మొత్తం బార్ అసోసియేషన్ లో 46 మంది న్యాయవాదులు ఉండగా, పోలింగ్లో 37 మంది పాల్గొన్నారు. 9 ఓట్ల ఆదిక్యంతో పార్థసారథి చౌదరి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ఎర్రిస్వామి, సంపత్ కుమార్ లు ప్రకటించారు.