రాయదుర్గం: రూ. 45లక్షల డబ్బుల నోట్లతో అమ్మవారికి అలంకరణ

67చూసినవారు
రాయదుర్గం పట్టణంలో రూ. 45 లక్షల డబ్బుల నోట్లతో ధనలక్ష్మి రూపంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి భక్తులకు కనువిందు చేసింది. దేవి శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా నాల్గవ రోజు ఆదివారం కోటలో నగరేశ్వర కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి డబ్బులతో అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. ప్రత్యేకించి అమ్మవారిని నేడు దర్శించుకుంటే ధన ప్రాప్తి కలుగుతుందని పురోహితులు సూచించారు.

సంబంధిత పోస్ట్