నీటిలో కరిగే మట్టి విగ్రహాలనే తయారీకి సహకరించాలని కురబలకోట ఎంఈవో ద్వారకనాథ్ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని పిచ్చలవాండ్లపల్లె, మట్లివారిపల్లె ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఎంఈఓ మాట్లాడుతూ నీటిలో సులువుగా సరిగా మట్టి విగ్రహాలని వినియోగించి పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా చూడాలని కోరారు. ఈవిషయంలో విద్యార్థులు తల్లిదండ్రులను చైతన్య పరచాలన్నారు.