AP: ఏపీలో ప్రస్తుతం వైసీపీకి కష్టకాలం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో వైసీపీని పలువురు ప్రముఖులు వీడుతున్నారు. తాజాగా వైసీపీ మరో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని 8 గ్రామాల సర్పంచులు వైసిపీకి గుడ్ బై చెప్పారు. అలాగే కూటమి మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు పార్టీ మారిన సర్పంచ్‌లు వెల్లడించారు.