ఆప్‌నకు మంత్రి కైలాష్ గహ్లోత్‌ రాజీనామా

80చూసినవారు
ఆప్‌నకు మంత్రి కైలాష్ గహ్లోత్‌ రాజీనామా
ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు కైలాష్ గహ్లోత్ ఆదివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. కైలాష్ న్యూ ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీనియర్ లీడర్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆప్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్