ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. ఈ విషయాన్ని అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు జీవీ హర్ష కుమార్ తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులను కలుపుకొని త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. మాల సామాజిక వర్గం నాయకత్వంలో ఈ పార్టీ నడవనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.