కూటమి సర్కార్ లో తొలి నామినేటెడ్ పోస్టు భర్తీ!

54చూసినవారు
కూటమి సర్కార్ లో తొలి నామినేటెడ్ పోస్టు భర్తీ!
ఏపీలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పై నేతల్లోనూ అంతే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా టికెట్లు దక్కని వారు నామినేటెడ్ పోస్టుల రేసులో పోటీ పడుతున్నారు. అయితే కూటమి సర్కార్‌లో తొలి నామినేటెడ్ పోస్టును భర్తీ చేశారు. ఏపీలో కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణయ్యను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెంటనే ఉత్తర్వులు కూడా జారీ కావడంతో ఆయన కూడా అంతే వేగంగా బాధ్యతలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్