భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ‘వివేక్ ఎక్స్‌ప్రెస్’. ఈ రైలు అసోంలోని దిబ్రూఘర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకూ దాదాపు 4,233 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. రైలు వారానికోసారి నడుస్తుంది. ఈ రైలులో ప్రయాణాన్ని పూర్తి చేయడానికి సుమారు 80 గంటలు పడుతుంది. దిబ్రూఘర్ నుంచి బయలుదేరే ఈ రైలు గువాహటి, ఖరగ్‌పూర్, కటక్, భువనేశ్వర్, విశాఖ పట్నం, విజయవాడ, సేలం, కొయింబత్తూర్, ఎర్నాకుళం, నాగర్‌కోవిల్ మీదుగా కన్యాకుమారి చేరుతుంది.