ఐరాస భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పాక్

61చూసినవారు
ఐరాస భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పాక్
పాకిస్తాన్ కీలకమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా చేరింది. రొటేషన్ పద్దతిలో పాకిస్తాన్‌కు ఈ అవకాశం దక్కింది. రెండేళ్లపాటు పాకిస్తాన్ మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా కొనసాగనుందని ఐరాస భద్రతామండలి ప్రకటించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పాకిస్తాన్ తన వంతుగా క్రియాశీలక పాత్ర పోషిస్తుందని ఐరాసలో పాకిస్తాన్ దౌత్యవేత్త మునీర్ అక్రమ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్