కొత్త సంవత్సరం రోజున కేరళలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వలక్కైలోని శ్రీకంఠపురంలో పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5వ తరగతి చిన్నారి మరణించింది. 13 మంది చిన్నారులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్యూర్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా, దీనికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి.