ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపుకు విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి సెక్రటరీ కృతికా శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల ఫీజు పే చేయని వారు తత్కాల్ విధానం కింద రూ.3000 అపరాధ రుసుముతో డిసెంబర్ 24 నుంచి 31 వరకు చెల్లించే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.