రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

71చూసినవారు
రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఏపీలోని రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. రైతులకు పశుగ్రాసం కొనుగోలు చేసేందుకు రుణాలు ఇస్తున్నారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ రుణాన్ని పొందొచ్చు. రైతులకు సంబంధించిన పాన్ కార్డు, ఆధార్ కార్డు, పొలానికి చెందిన పాస్ పుస్తకం, రెండు పాస్ పోర్టు సైజు ఫోటోలతో పాటు పశువులు ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని పశు వైద్యాధికారికి సమర్పించాలి. నియమ నిబంధనలకు అనుగుణంగా అన్నదాతలకు రుణం మంజూరవుతుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్