AP: ముంబై నటి జెత్వానీ కేసులో అరెస్టైన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ విద్యాసాగర్ పిటిషన్ వేశారు. విజయవాడ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే నేడు విచారణ జరిపిన హైకోర్టు.. విద్యాసాగర్ అరెస్ట్ విషయంలో జోక్యానికి నిరాకరించింది.