AP: బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. వరద ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌తో కలిసి మాట్లాడారు. కృష్ణా నది కరకట్టలు మరింత పటిష్టం చేస్తామని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్‌కు 15 లక్షల క్యూసెక్కులు వచ్చినా తట్టుకునేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.