చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారానికి ఏర్పాట్లు

58చూసినవారు
చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారానికి ఏర్పాట్లు
AP: ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ కూట‌మి ఘ‌న విజ‌యం సాధించ‌గా.. ఈ నెల 12న రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. 12వ తేదీన ఉద‌యం 11 నుంచి 12 గంట‌ల మ‌ధ్య‌లో ఆయ‌న ప్ర‌మాణం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అమ‌రావ‌తి ప్రాంతంలో ప్ర‌మాణ స్వీకార ప్రాంగ‌ణాన్ని ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

సంబంధిత పోస్ట్