ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. జిల్లా అధ్యక్షుడు రియాజ్‌కి వ్యతిరేకంగా జనసేన పార్టీ ఇన్‌చార్జ్‌లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రియాజ్‌పై పలు విమర్శలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ ఆశయాలను రియాజ్ తుంగలో తొక్కుతున్నాడని, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని వారు కోరారు. అంతేకాకుండా జిల్లాపై పార్టీ అధిష్టానం కూడా దృష్టి సారించాలని తెలిపారు.