ఏపీలో కొడుకు వేధింపులు భరించలేక సుపారీ ఇచ్చి తండ్రే హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా మామిడి గుంపలపల్లెకు చెందిన సోమశేఖర రెడ్డి వేధింపులు భరించలేక పదేళ్ల క్రితం అతని భార్య, ఐదేళ్ల కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాక కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో తండ్రి గంగులరెడ్డి అమర్, రమేష్ అనే ఇద్దరితో రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకుని కొడుకును చంపించాడు. అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య చేశారు.