బైకర్‌ను ఢీకొట్టి 30 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డిప్యూటీ తహసీల్దార్ కారు

78చూసినవారు
బైకర్‌ను ఢీకొట్టి 30 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డిప్యూటీ తహసీల్దార్ కారు
యూపీలోని బహ్రాయిచ్‌ జిల్లాలో గురువారం దారుణ ఘటన జరిగింది. డిప్యూటీ తహసీల్దార్ ప్రయాణిస్తున్న వాహనం బైకర్‌ను ఢీకొట్టి 30 కి.మీ ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో బైకర్ నరేంద్రకుమార్ హల్దార్ (35) అనే వ్యక్తి మృతి చెందాడు. నాన్‌పారా-బహ్రాయిచ్ రహదారిపై డిప్యూటీ తహసీల్దార్ శైలేశ్ అవస్థి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బైకర్‌ను ఢీకొట్టింది. దీంతో నరేంద్ర కారు కింద చిక్కుకుపోయాడు. అది గమనించని కారు డ్రైవర్ మేరజ్ అహ్మద్ అలాగే నడుపుకుంటూ 30 కిలోమీటర్లు ప్రయాణించాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్