మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ హయాంలో తనను జైలులో పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆరోపించారు. అయితే తానేమీ కక్ష సాధింపులకు దిగడం లేదని, తన కోపం నరం తెగిపోయిందని చెప్పారు. కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను తలచుకుంటే ఒక్కడూ మిగలడని వార్నింగ్ ఇచ్చారు. అన్ని వర్గాలనూ మోసం చేసిన జగన్.. ఏకంగా రూ.13 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు.