AP: సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాను. నాలుగు రోజులు కడప సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. ఐదో రోజు సుమారు 11 గంటలు పులివెందుల పోలీసులు విచారించారు. తిరిగి ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని 41ఏ నోటీసులు జారీ చేశారు' అని చెప్పుకొచ్చారు.