అమెరికాలోని ఫాల్ రివర్ మసాచుసెట్స్ ప్రాంతంలో ఓ వింత ఘటన జరిగింది. రాబర్ట్ లాంగ్లాయిస్‌తో పాటు మరికొందరు డ్రగ్స్ తెచ్చి అమ్మేవారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అక్కడి పోలీసులు అనుమానిత ఇళ్లలో రైడ్ చేశారు. పోలీసులు వస్తున్నారన్న సంగతి తెలుసుకున్న రాబర్ట్ వారి నుంచి తప్పించుకునే క్రమంలో చిమ్నీ గొట్టంలో ఇరుక్కుపోయాడు. దీంతో చివరికి పోలీసుల సాయం కోరాడు. పోలీసులు గోడ పగలగొట్టి తాడు సాయంతో పైకి రప్పించి అరెస్ట్ చేశారు.