LIC సరళ్ పెన్షన్ యోజన పేరిట పథకాన్ని అందిస్తోంది. ఇందులో 40 ఏళ్లకే పెన్షన్ పొందే వీలుంది. కనీస పింఛన్ నెలకు రూ.1000 చొప్పున పొందే అవకాశం ఉంది. 40 ఏళ్లు పూర్తయిన వారు ఈ పెన్షన్ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఆప్షన్-1 ఎంపిక చేసుకుని రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే ఏడాదికి రూ.58,950 పెన్షన్ అందుతుంది. అదే ఆప్షన్-2 ఎంచుకుంటే ఏడాదికి రూ.58,250 చొప్పున పెన్షన్ అందుతుంది. వీరు తదనంతరం పూర్తి మొత్తం నామినీలకు అందుతుంది.