బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. భోజ్‌పూర్ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై ఆమె మేమామ అత్యాచారం చేసి కొట్టి చంపాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతితో కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.