AP: చిత్తూరు జిల్లాల్లో వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. పులిచెర్ల జడ్పీటీసీ మురళీధర్, పులిచెర్ల వైస్ ఎంపీపీలు రాశిప్రసాద్, ఈశ్వరిలతో పాటు నలుగురు ఎంపీటీసీ సభ్యులు, ఏడుగురు సర్పంచులు తమ పదవులకు, వైసీపీకి రాజీనామా చేశారు.