కొరిశపాడు మండలం మెదరమెట్ల గ్రామంలో శనివారం శానిటేషన్ డే సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు నిర్వహించారు. ప్రతి శనివారం శానిటేషన్ డే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు సెక్రటరీ లక్ష్మీకాంత్ తెలియజేశారు. పారిశుధ్యం పరంగా ఎవరికైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.