కాంగ్రెస్‌పై తెలంగాణ బీజేపీ సంచలన ట్వీట్

67చూసినవారు
కాంగ్రెస్‌పై తెలంగాణ బీజేపీ సంచలన ట్వీట్
కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ బీజేపీ సంచలన ట్వీట్ చేసింది. కాంగ్రెస్ విధానం హిందువులకు వ్యతిరేకం అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కాంగ్రెస్‌పై మండిపడింది. సెక్యులర్ ముసుగులో హిందూ ధర్మంపై ఉన్మాదం అని వ్యాఖ్యానించింది. హిందూ మత ఆచార, సంప్రదాయాలపై కట్టుకథలు, ఉన్మాద వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకోవడమే కాంగ్రెస్‌కు తెలిసిన నీతా? అని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్