చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటంతో విజయనగరం నియోజకవర్గానికి చెందిన చెందిన మోహన్ రావు విజయనగరం నుండి తిరుపతి వరకు చేపట్టిన సైకిల్ యాత్ర శుక్రవారం కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గెలిచిన సందర్భంగా తాను మోక్కు చెల్లించుకోవడానికి సైకిల్ పై తిరుపతి వెళుతున్నట్లు చెప్పారు. వర్షం కారణంగా ప్రయాణం ఆలస్యంగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.