కొరిశపాడు మండలం దైవాల రావూరు కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న జానీ భాషను సస్పెండ్ చేస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సరియా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన గతంలో మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామపంచాయతీ కార్యదర్శి గా పనిచేసిన సమయంలో నీటి పన్ను వసూళ్లలో అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలడంతో జానీ భాషను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.