అద్దంకి నియోజకవర్గంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. పోలీస్ స్టేషన్ లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండా రెపరెపలాడింది. కొరిసపాడు మండల పరిషత్ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఎంపీడీవో సురేష్ బాబు పాల్గొని మాట్లాడారు. స్వాతంత్రం కోసం భగత్ సింగ్ ఉరి ఎక్కాడని, ప్రకాశం పంతులు బ్రిటిష్ వారికి ఎదురు నిలిచాడని ఆయన పేర్కొన్నారు.