జె. పంగులూరు: ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న 115 జయంతి వేడుకలు

72చూసినవారు
జె. పంగులూరు: ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న 115 జయంతి వేడుకలు
పంగులూరు మండలం ముప్పవరం గ్రామ "జై గౌడ్ ఉద్యమం సంఘం" ఆధ్వర్యంలో, శుక్రవారం సర్దార్ గౌతు లచ్చన్న 115 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో జిల్లా "జై గౌడ్ ఉద్యమ సంఘం" అధ్యక్షులు మోరపాకుల. లక్ష్మణ స్వామి గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ. ఉక్కు సత్యాగ్రహం చేపట్టిన మహానీయుడు సర్దార్ గౌతు లచ్చన్న అని తెలియజేశారు. అలాంటి మహనీయుడు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను, రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంచనాలతో నిర్వహించాలని కోరారు.

సంబంధిత పోస్ట్