సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం గ్రామంలో అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం టిడిపి, కార్యకర్తలు నాయకులు తో సమావేశం నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న సమస్యలను మంత్రి రవికుమార్ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు పుష్కలంగా నీరు అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.