కొరిసపాడు మండలం కొరిసపాడు ప్రాథమిక వైద్యశాల పరిధిలో ఈ నెల 18వ తేదీ నుంచి కుష్టి వ్యాధి పై ఇంటింటి సర్వే జరుగుతుందని మండల వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ మంగళవారం మీడియా ప్రకటన ద్వారా తెలియజేశారు. తమ ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తారని ఆయన పేర్కొన్నారు. సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డాక్టర్ రాజశేఖర్ కోరారు.